జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్లో తాళం వేసి ఉన్న 5 ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. రెండు తులాల బంగారం, రూ. 10 వేల నగదు మాయమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు.
జగిత్యాల జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు - Telangana news
జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కొద్ది రోజులుగా వరుస దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాయికల్ మండలం మైతాపూర్ తాళం వేసి ఉన్న 5 ఇళ్లలో చోరీ జరిగింది.
Theft in raikal
హనుమాన్వాడలోనూ దొంగలు తెగబడ్డారు. పచర్ల రాజమల్లయ్య అనే బీడీ కంపెనీ వ్యాపారి ఇంట్లో చొరబడి రూ. 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. పక్షం రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వరుస చోరీలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఇదీ చదవండి:ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం... నిరవధిక వాయిదా