మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక ఓ రోగి మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపించారు. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. మూసాపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్యను అనారోగ్యం కారణంతో బుధవారం ఉదయం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చామని... ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల పరీక్షల పేరిట కాలయాపన చేశారని వాపోయారు.
వైద్యుల నిర్లక్ష్యం.. రోగి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - తెలంగాణ వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి ఎదుట ఓ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే తమ బంధువు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలికి వచ్చి ఆందోళన విరమించాలనగా... ఇరు వర్గాల నడుమ వాగ్వాదం జరిగింది.
సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడాని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెపోటు అని చెబితే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లమని... వైద్యులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. రోగి గుండెపోటుతో మరణించారని... ముగ్గురు డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించినట్టు వైద్యులు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉందని బంధవులకు చెప్పినట్లు వివరించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని... ఆందోళన విరమించాలని ఆదేశించారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులకు నడుమ వాగ్వాదం జరిగింది.
ఇదీ చదవండి:ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్..హత్యాయత్నం