మంచిర్యాల జిల్లా మందమర్రిలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. మందమర్రిలోని ఓ ఇంట్లో గత కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఒక యువతితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు.
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఓ యువతి, ఇద్దరు విటుల అరెస్ట్ - మందమర్రిలో వ్యభిచారం చేస్తోన్న ముగ్గురి అరెస్ట్
మంచిర్యాల జిల్లా మందమర్రిలో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఓ యువతితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు.
వ్యభిచార ముఠా అరెస్ట్
శాంతి నగర్‌కు చెందిన వడల ప్రశాంత్ తన ఇంట్లో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని రోజులుగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటి యజమాని ప్రశాంత్‌తో పాటు ఇద్దరు సింగరేణి ఉద్యోగులు కుమారస్వామి, బాలుకర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి.. రెమ్‌డెసివిర్ అక్రమ విక్రయాల్లో నిందితుల గుర్తింపు