తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రత్యేక దుస్తుల్లో అక్రమ రవాణా.. రూ.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం - 5 core prpoerty seized in kurnool

Rs.5 crore seized: ప్రైవేటు ట్రావెల్స్​లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 90 లక్షల విలువైన నగదు సహా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

5 core prpoerty seized in kurnool
5 core prpoerty seized in kurnool

By

Published : Mar 6, 2022, 11:16 AM IST

Rs.5 crore seized: ఏపీ కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద.. అక్రమంగా తరలిస్తున్న రూ.5 కోట్ల విలువైన సొత్తును సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేస్తుండగా.. నలుగురు ప్రయాణికుల వద్ద బంగారం, వెండి, నగదు గుర్తించారు. 8 కిలోల 250 గ్రాముల బంగారు బిస్కెట్లు, 28.5 కిలోల వెండితో పాటు.. రూ.90 లక్షలు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు ఎలాంటి పత్రాలు లేకుండా బంగారం, వెండి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. బంగారాన్ని ఎవరూ గుర్తుపట్టని విధంగా.. ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తుల్లో తీసుకొని వెళ్తున్నట్లు సెబ్​ అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసినట్లు తెలిపారు.


ఇదీచూడండి:టాటూల కోసం వెళ్తే లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details