అక్రమంగా నిల్వ చేస్తున్న నిషేధిత గడ్డి మందును వికారాబాద్ జిల్లా కొడంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పట్టణంలోని వైష్ణవి ఏజెన్సీ పురుగుల మందుల దుకాణంలో దాడులు చేయగా... 3,400 లీటర్ల నిషేధిత గ్లైపోసెట్ గడ్డి మందును పట్టుకున్నారు. షాపు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
భారీగా నిషేధిత గ్లైపోసెట్ గడ్డి మందు స్వాధీనం - Seizure of illicit grass drug
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో అక్రమంగా నిల్వ చేస్తున్న 3,400 లీటర్ల నిషేధిత గడ్డి మందును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిషేధిత గ్లైపోసెట్ గడ్డి మందు స్వాధీనం
ఈ గడ్డి మందు వినియోగం వల్ల భూసారం తగ్గి పంటల దిగుబడి తగ్గుతుందని పోలీసులు పేర్కొన్నారు. నిషేధిత క్రిమిసంహారక మందులు, నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:మాంసం కోసం కిరాతకం.. ప్రాణంతో ఉన్న పాడిగేదెల తొడలు కోసి..!