Progress in Siddipet District ZPTC Mallesham murder case: సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్య కేసులో నిందితుడు పోలీసులకు లొంగిపోయారు. గురిజకుంట ఉపసర్పంచ్ సత్యనారాయణ, అనుచరుడు జడ్పీటీసీని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కులసంఘంలో, రాజకీయంగా అడ్డువస్తున్నాడన్న కారణంతో హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. మల్లేశంను కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచి చంపినట్లు చెప్పారు. హత్య చేయడానికి వాడిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు చెప్పారు.
అసలేం జరిగిందంటే: మల్లేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో చేర్యాల జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. తెల్లవారుజాము వాకింగ్‌కి ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. గురిజకుంట శివారులోని చేర్యాల మార్గంలో అతనిపై దుండుగులు దాడి చేశారు. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని.. రక్తపుమడుగులో ఉన్న మల్లేశాన్ని సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.