నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నాగార్జునసాగర్ హిల్‌కాలనీకి చెందిన వనం రవికుమార్(31) బీఈడీ పూర్తిచేశారు. పదేళ్ల కిందట ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన అక్కమ్మతో ఆయనకు వివాహమైంది. అప్పటి నుంచి పెద్దవూరలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరికి ఓ బాబు, పాప. కరోనా కారణంగా ఏడాదిగా పాఠశాలలు మూతపడి ఉపాధి కోల్పోవడంతో రవికుమార్‌కు కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఆయన తండ్రి సాగర్‌లో సైకిల్‌షాప్ నడుపుతున్నారు.
ఉపాధిని కబళించిన కరోనా.. ప్రైవేటు ఉపాధ్యాయుడి ఆత్మహత్య - Nalgonda district latest news
కరోనా కారణంగా బడులు మూతపడి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన ఉపాధి ఊడిపోయింది. తన కుటుంబ పోషణ కూడా తండ్రిపై పడటం, ఆర్థిక ఇబ్బందులతో తరచూ తలెత్తే గొడవలతో భార్య ఇల్లు విడిచిపోవటం.. వెరసి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడి బలవన్మరణానికి కారణలయ్యాయి.
ఈ క్రమంలో రవికుమార్ కుటుంబ పోషణ భారం కూడా ఆయనపై పడటంతో భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఆదివారం భార్య అక్కమ్మ ఇంట్లో చెప్పకుండా పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోవటంతో సోమవారం రవికుమార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు భార్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన రవికుమార్ మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యం చేసుకున్నాడు. అతడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సాగర్ ఏఎస్సై బాషా నాయక్ తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
- ఇదీ చూడండి: తూటా చప్పుడు లేని దండకారణ్యాన్ని చూస్తామా..?