నాగోలు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు వేసిన బిల్లు చూసి బాధితుడి గుండె గుభేల్‌మంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఏప్రిల్ 15న ఈ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురువారం డిశ్ఛార్జి చేసే ముందు రూ. 24 లక్షల బిల్లు చేతికిచ్చారు.
ఆ రూ.24 లక్షల కొవిడ్ బిల్లు చూశారా..? - కరోనా రోగుల వార్తలు
కరోనా సోకి ప్రాణాలు దక్కించుకొనేందుకు ఎక్కడ ఆక్సిజన్ సౌకర్యం ఉండే బెడ్ దొరుకుతుందో, ఎక్కడ ఐసీయూ సౌకర్యం ఉందోనని పరుగులు పెడ్తున్న నిస్సహాయులను ప్రైవేటు ఆసుపత్రులు నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు లభిస్తున్నా... అవి అందరికీ అందుబాటులో లేకపోవడంతో చాలా మందికి ప్రైవేటు ఆసుపత్రులే దిక్కవుతున్నాయి.
29 రోజులకు రూ.24 లక్షల బిల్లు!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు కొవిడ్ బాధితుడికి ఐసీయూకు రూ. 9,000, ఆక్సిజన్ బెడ్‌కు రూ.7000, సాధారణ వార్డుకు రూ.4000 చొప్పున మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మాత్రం రూ.24 లక్షలు చెల్లిస్తేనే ఇంటికి పంపుతామని స్పష్టం చేయడంతో బంధువులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఇదీ చూడండి:కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్
Last Updated : May 17, 2021, 6:16 PM IST