Accident in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద సంగీత ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలో ముగ్గురు.. భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురు భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు మృతి.. - private bus bolta in alluri district
Accident in Alluri District : ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందిన ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Accident in Alluri District
ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ధనేశ్వర్ దళపతి(24), జీతు హరిజన్(5), సునేనా హరిజన్(2)తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరంతా ఒడిశా వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.