తెలంగాణ

telangana

ETV Bharat / crime

రూ.3,316 కోట్ల మోసం.. పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ అరెస్టు - తెలుగు వార్తలు

prithvi-information-solutions-pvt-ltd-md-arrested-by-ed-in-hyderabad
రూ.3,316 కోట్ల మోసం.. పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ అరెస్టు

By

Published : Aug 19, 2021, 11:18 AM IST

Updated : Aug 19, 2021, 11:54 AM IST

11:16 August 19

రూ.3,316 కోట్ల మోసం.. పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండీ అరెస్టు

        పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అరెస్టు అయ్యారు. ఉప్పలపాటి సతీశ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకులను మోసం చేశారన్న కేసులో ఉప్పలపాటి సతీశ్​ను అదుపులోకి తీసుకున్నారు. 

        సుమారు రూ.3,316 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసినట్టు అభియోగం.. సతీశ్‌పై ఉంది. కోర్టు అనుమతితో సతీశ్‌ను ఈడీ కస్టడీకి తీసుకుంది. సతీశ్‌ సోదరి వీఎంసీఎల్ ఎండీ హిమబిందును ఈడీ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు.

అసలు ఎవరీ హిమబిందు.. ఏమైంది?

         మనీలాండరింగ్​కు పాల్పడి బ్యాంకులకు సుమారు 3,316 కోట్ల రూపాయల నష్టం కలిగించారన్న అభియోగంపై టెలికాం పరికరాల తయారీ సంస్థ వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ వి.హిమబిందును ఇటీవల ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. రుణాల పేరుతో వివిధ బ్యాంకులను మోసం చేశారని 2018లో వీఎంసీ సిస్టిమ్స్ లిమిటెడ్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 

వివిధ బ్యాంకులకు వీఎంసీ సిస్టమ్స్ సుమారు 3,316 కోట్ల రూపాయల రుణాలు బకాయిపడినట్లు ఈడీ పేర్కొంది. రుణాల సొమ్మును వివిధ కంపెనీల పేరిట బదిలీ చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్​లో తేలిందని ఈడీ తెలిపింది. బీఎస్ఎన్ఎల్ టెండర్లతో ఎలాంటి సంబంధం లేని పీఐఎస్ లిమిటెడ్​కు వీఎంసీ సిస్టమ్స్ 3 శాతం కమీషన్ ఇచ్చినట్లు ఫోరెన్సిక్ ఆడిట్​లో బయటపడిందని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ వివరించింది.

   బోగస్ సంస్థల పేరిట సుమారు 692 కోట్ల రూపాయల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్లు తెరిచినట్లు ఈడీ తెలిపింది. బ్యాంకులను మోసం చేసేందుకు తన సోదరుడు వి.సతీశ్​​తో కలిసి హిమబిందు బోగస్ రశీదులు, పత్రాలు, దస్త్రాలు సృష్టించినట్లు ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. కొంత సొమ్మును తన కుటుంబ సభ్యులకు చెందిన విదేశీ కంపెనీలకు కూడా మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ వివరించింది. 

          గత నెల 20న హిమబిందు, సతీశ్​, వి.మాధవి ఇళ్లల్లో సోదాలు జరిపి సుమారు 40 హార్డ్ డిస్కుల్లో డిజిటల్ డేటా, ఆరు చరవాణులు, రెండు ల్యాప్ టాప్​లను ఈడీ స్వాధీనం చేసుకుంది. సమన్లు ఇచ్చినప్పటికీ హిమబిందు స్పందించడం లేదని.. లావాదేవీలకు సంబంధించిన వివరాలు, దస్త్రాలు సమర్పించకుండా విచారణకు సహకరించక పోవడంతో.. అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. 

ఈ నేపథ్యంలో పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సతీశ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

ఇవీ చూడండి: 

Last Updated : Aug 19, 2021, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details