హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీ(prisoner) ఆత్మహత్య(suicide)కు పాల్పడ్డారు. జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న బానోతు శ్రీనివాస్ బెడ్ షీట్‌తో ఆదివారం ఉదయం ఉరేసుకున్నారు. అనారోగ్యంతో రెండు రోజులుగా జైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
Suicide: చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
చర్లపల్లి జైలులో ఖైదీ(prisoner) ఆత్మహత్య(suicide)కు పాల్పడ్డారు. జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న బానోతు శ్రీనివాస్ ఆదివారం ఉదయం ఉరేసుకున్నారు. శ్రీనివాస్ అనారోగ్యంతో రెండు రోజులుగా జైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్య, కేంద్ర కారాగారంలో ఖైదీ బలవన్మరణం
సూర్యాపేటలో 2019లో జరిగిన హత్య కేసులో శ్రీనివాస్‌కు నల్లగొండ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కిటికీకి ఉరేసుకున్న శ్రీనివాస్‌ను గమనించిన సిబ్బంది... ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడని జైలు అధికారులు కుషాయిగూడ పోలీసులకు తెలిపారు.
ఇదీ చదవండి:Dead Body: ఆస్పత్రిలో నవవధువు మృతదేహం.. ఆమె ఎవరు? అక్కడెందుకు వదిలేశారు?