తెలంగాణ

telangana

ETV Bharat / crime

Prisoner Escapes from Court: పోలీసుల కళ్లుగప్పి కోర్టు నుంచి జీవిత ఖైదీ పరారీ - సినీ ఫక్కీలో తప్పించుకున్న జీవిత ఖైదీ

Prisoner Escapes from Court: మిర్యాలగూడ కోర్టు నుంచి జీవిత ఖైదీ ఒకరు సినీ ఫక్కీలో పరారయ్యాడు. కోర్టు ప్రాంగణంలో బంధువులతో మాట్లాడుతున్నట్లు నటించిన ఖైదీ... పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

Prisoner Escapes from Court
Prisoner Escapes from Court

By

Published : May 6, 2022, 12:13 PM IST

Prisoner Escapes from Court: నల్గొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు నుంచి జీవిత ఖైదీ ఒకరు సినీ ఫక్కీలో తప్పించుకుని పరారయ్యాడు. వివిధ నేరాలకు పాల్పడటంతో రవిశంకర్‌ అనే వ్యక్తి... హైదరాబాద్ చర్లపల్లి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2019లో వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ చీటింగ్, కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న రవిశంకర్‌ను... విచారణ నిమిత్తం మిర్యాలగూడ కోర్టుకు తీసుకువచ్చారు.

కోర్టు ప్రాంగణంలో బంధువులతో మాట్లాడుతున్నట్లు నటించిన రవిశంకర్... పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. జీవిత ఖైదీ తప్పించుకు పోవడంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పారిపోతున్న ఖైదీని ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:జంటహత్య కేసులో ఆసక్తికర విషయాలు.. మర్డర్​కు ముందు ఏం జరిగిందంటే..?

ABOUT THE AUTHOR

...view details