రంగారెడ్డి జిల్లా హైదర్ షా కోట్ భాగ్యనగర్ కాలనీలోని విజయ గణపతి ఆలయంలో పూజారి చరవాణిని ఓ వ్యక్తి దొంగలించాడు. భక్తుడిలా ఆలయంలోకి వచ్చిన దొంగ... అర్చన చేయాలని పూజారిని కోరాడు.
పూజారి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ భక్తుడు - Priest cellphone stolen in Vijaya Ganapati temple
భక్తుడిలా వచ్చాడు.. అర్చన చేయమన్నాడు.. పూజారిని మభ్య పెట్టాడు.. ఆ తర్వాత ఆ పూజారి సెల్‌ఫోన్‌తో ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూజారి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ భక్తుడు
ఇప్పుడే గుడి తెరిచామని పూజా కార్యక్రమాలకు సమయం పడుతుందని అర్చకుడు తెలిపాడు. దీంతో ఆలయంలో అటు ఇటు తిరిగిన అతడు.... స్వామివారికి దండం పెట్టినట్లు చేసి పక్కనే ఉన్న చరవాణి ఎత్తుకెళ్లాడు. పూజానంతరం చరవాణి కనిపించకపోవడంతో... సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
పూజారి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ భక్తుడు
- ఇవీ చూడండి:ట్రాన్స్ జెండర్లు రక్తదానం చేయొద్దా?