తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆడపిల్ల పుడుతుందని మనోవేదనతో గృహిణి ఆత్మహత్య.. తీరా పోస్టుమార్టంలో చూస్తే! - pregnant died

Pregnant suicide: అమ్మ కాబోతుంటే ఏ మహిళ ఆనందానికి అవధులు ఉండవు. పండంటి బిడ్డ పుట్టబోతుందని పండంటి కలలు కనటం సహజం. తన బిడ్డ ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అని.. తల్లులు కలలు కంటూ ఉంటారు. క్షణక్షణం ఆ అనుభూతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ తల్లి మాత్రం భయం నీడలో బతికింది. తొలి సంతానం ఆడపిల్ల పుట్టిందని.. మళ్లీ ఇప్పుడు ఆడపిల్లే పుడితే అత్తింటి వారి నుంచి ఎలాంటి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే మనస్తాపంతో తన ప్రాణాలనే బలితీసుకుంది.

ఆడపిల్ల పుడుతుందని మనోవేదనతో గృహిణి ఆత్మహత్య.. తీరా పోస్టుమార్టంలో చూస్తే!
ఆడపిల్ల పుడుతుందని మనోవేదనతో గృహిణి ఆత్మహత్య.. తీరా పోస్టుమార్టంలో చూస్తే!

By

Published : Jan 7, 2022, 5:48 PM IST

Pregnant suicide: కాన్పు దగ్గర పడుతున్న కొద్ది సంబరం కన్నా సందేహం ఆ తల్లి మనసును కలచి వేసింది. తొలి సంతానం ఆడపిల్ల.. మళ్లీ ఆడపిల్ల పుడితే అత్తింటివారు ఏమనుకుంటారోనని ఆందోళన చెందిన ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తీరా పోస్టుమార్టం నివేదికలో ఆమె గర్భంలో ఉన్నది మగశిశువని వైద్యులు నిర్ధారించారు. ....

వివరాల్లోకి వెళ్తే..

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్​కు చెందిన ఎగ్గెనా ఆనంద్, దండేపల్లి మండలం నర్సాపూర్​కు చెందిన రమ్య (25)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. తొమ్మిది నెలల క్రితం రమ్య మళ్లీ గర్భం దాల్చడంతో భర్త స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

15రోజుల క్రితం బోనాల పండుగ కోసం రమ్య భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ప్రసవం అయ్యేంతవరకూ పుట్టింట్లోనే ఉంటానని భర్తతో చెప్పి తల్లి శారద వద్దే ఉండిపోయింది. ఈ నెల 3న వైద్య పరీక్షల కోసం రమ్య తల్లితో కలిసి మంచిర్యాలకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆనంద్ ఆస్పత్రికి చేరుకుని రమ్యను ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా నిరాకరించడంతో వెళ్లిపోయారు.

ఈ నెల 6వ తేదీకి డెలివరీ డేట్ ఇవ్వడంతో కూతురును అల్లుడి ఇంటికి తీసుకుని వెళ్లి రమ్యను అక్కడే ఉండాలని డాక్టర్ సూచించింది. గురువారం కాన్పుకోసం ఆస్పత్రికి వెళ్లాల్సిన రమ్య.. తనకు ఆడపిల్ల పుడితే అత్తింటి వారు ఏమంటారోనని ఆందోళన చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యానుకు ఉరిపోసుకుని చనిపోయిందని మంచిర్యాల సీఐ నారాయణ్​ నాయక్​ వెల్లడించారు.

మళ్లీ ఆడపిల్లే పుడుతుందని..

రమ్యకు మూడేళ్ల క్రితం పాప పుట్టింది. మళ్లీ ఆమె గర్భం దాల్చగా.. 6వ తేదీకి వైద్యులు డెలివరీ డేట్​ ఇచ్చారు. ఈ లోపు రమ్య తొలి సంతానం ఆడపిల్ల పుట్టిందని.. మళ్లీ ఆడపిల్లే పుడుతుందని ఆమెకు ఆమె ఊహించుకుని మనస్తాపం చెంది ఎన్టీఆర్​ నగర్​లో స్వగృహంలోనే చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -నారాయణ్​ నాయక్​, మంచిర్యాల సీఐ

రమ్య అంత్యక్రియలకు ముందు మృతదేహానికి వైద్యులు చేసిన పంచనామాలో ఆమె గర్భంలో ఉన్నది మగశిశువని తేలడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. మృతి పట్ల రమ్య అత్తింటి వారిపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details