పెద్దపల్లి జిల్లా పెద్దబొంకర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష అనే గర్భిణీ బుధవారం రాత్రి ప్రసవం నిమిత్తం... కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు గర్భిణీకి చికిత్స అందించగా... మగశిశువుకు జన్మనిచ్చి అనూష మృతి చెందింది. కానీ ఈ విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులకు దాచి ఉంచారని ఆరోపించారు.
గర్భిణీ మృతి... బంధువుల దగ్గర దాచిన వైద్యులు! - Pregnant woman dies
ప్రసవ సమయంలో గర్భిణీ మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా (PEDDAPALLI DISTRICT)లో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానం వచ్చిన బంధువులు వైద్యులను ప్రశ్నించారు. చివరికి చేసేదేమి లేక అనూష ప్రసవం పొందే సమయంలోనే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. ఆగ్రహానికి గురైన బంధువులు... వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే అనూష మృతి చెందిందని ఆరోపించారు. ఉదయం నుంచి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని వెల్లడంచారు. దీంతో ఆందోళనను విరమించుకున్నారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి:Saidabad Incident: రాజు కనిపించాడు.. 10 లక్షల రివార్డు నాకే ఇస్తారా..?