తెలంగాణ

telangana

ETV Bharat / crime

రిమ్స్​లో బాలింత మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన

pregnant died in rims: వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ ఆదిలాబాద్​లో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి మద్దతుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేశాయి. వైద్యులపై కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత చనిపోయిందంటూ కుటుంబీకుల ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత చనిపోయిందంటూ కుటుంబీకుల ఆందోళన

By

Published : Jan 6, 2022, 12:05 PM IST

pregnant died in rims: రిమ్స్‌ వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందంటూ ఆదిలాబాద్‌లో మృతురాలి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో రిమ్స్‌ ఆసుపత్రి ఎదుట రహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబానికి మద్దతుగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేశాయి. వారి ఆందోళనతో గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుడిహత్నూర్‌ మండలం సూర్యగూడకు చెందిన కుమ్ర గంగాదేవి ఐదు రోజుల కిందట రిమ్స్‌లో చేరింది. సిజేరియన్‌ చేసి వైద్యులు బిడ్డకు పురుడుపోశారు. అంతలోనే ఏమైందో ఏమో పరిస్థితి విషమించి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు చెప్పడంతో బంధువులు హుటాహుటిన అక్కడికి తీసుకెళ్లారు.

చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు. సదరు వైద్యులపై కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్‌ డిమాండ్‌ చేశారు. ఆందోళన విరమింపజేయాలని పోలీసులు ప్రయత్నించినా.. వారు రహదారిపైనే బైఠాయించి నిరసన కొనసాగించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details