'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు
16:24 August 13
'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు
జగిత్యాల జిల్లాలో శవం వద్ద పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. జగిత్యాల రూరల్ మండలం టీఆర్‌నగర్‌లో ఓర్సు రమేశ్ మృతి చెందాడు. మంత్రాల కారణంగానే రమేశ్ మృతి చెందాడని.. పుల్లయ్య అనే వ్యక్తిని బాధిత కుటుంబ సభ్యులు చితక బాదారు. తానే మంత్రాలతో రమేశ్‌ను చంపానని, మంత్రాలతో మళ్లీ బతికిస్తానంటూ ఉదయం నుంచి శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయడం మొదలుపెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్ మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.
అతన్ని విడిచిపెట్టాలని కోరుతూ కొద్దిసేపు జగిత్యాల-కరీంనగర్ రహదారిపై గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పుల్లయ్య ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసుల పహారా కొనసాగుతోంది.
ఇదీ చదవండి:murder: పాతకక్షలతో పొడిచి.. పొడిచి.. చంపారు