Fake Notes Incident Update : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సాయపాలెంలో ఆదివారం వాలంటీర్లు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లు వచ్చిన విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పింఛన్ల సొమ్ములో దొంగ నోట్లు రావడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పింఛన్ డబ్బులను పంపిణీ చేసిన వాలంటీర్ ఆమోస్‌ను ప్రశ్నంచగా.. అతడు బుకాయించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వాలంటీర్ ఆమోస్‌ను గట్టిగా అడగ్గా అసలు విషయం బయటపడింది.
తానే ఆ దొంగ నోట్లను మార్చినట్లు ఒప్పుకున్నాడని ఎంపీడీవో సుబ్బారాయుడు తెలిపారు. అతడిని విధుల నుంచి తొలిగించి, పోలీసులకు అప్పజెప్పామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాలంటీర్ ఆమోస్‌కి దొంగ నోట్లు ఎలా వచ్చాయి? ఎక్కడ నుంచి వచ్చాయి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.