తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనిశా అధికారుల వలలో విద్యుత్ శాఖ అధికారి - telnagana news

అనిశా అధికారుల వలకు ఓ విద్యుత్‌ శాఖ అధికారి చిక్కాడు. ఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజినీర్ మనోహర్ లంచం తీసుకుంటూ... ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రేటర్ పరిధిలోని ఓ రియల్టర్ వెంచర్​కు విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్‌ ఇచ్చేందుకు రూ.35 వేలు లంచం అడగడంతో వారు ఏసీబీకి సమాచారం ఇచ్చారు.

power department officer red handedly catched by acb
అనిశా అధికారుల వలలో విద్యుత్ శాఖ అధికారి

By

Published : Apr 16, 2021, 8:23 AM IST

మింట్ కంపౌండ్​లోని విద్యుత్ కార్యాలయంలో కమర్షియల్ డీఈగా మనోహర్ పనిచేస్తున్నారు. మార్చి 9వ తేదీన గ్రేటర్ పరిధిలోని ఓ రియల్టర్ వెంచర్​కు విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్ ఇవ్వాలని కోరగా మనోహర్​ రూ.35 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిలో ఎలాంటి తగ్గింపు లేదని... మొత్తం ఇవ్వాలని పట్టుబట్టడంతో వారు ఏసీబీని ఆశ్రయించినట్లు ఆ విభాగం సిటీ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

పక్క ప్రాణాళికతో 35 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో వెంటనే డీఈ మనోహర్​ను అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. లంచం డిమాండ్ చేసే అధికారులపై వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సంప్రదించాలని డీఎస్పీ కోరారు.

ఇదీ చూడండి:సైదాబాద్​ మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details