తెలంగాణ

telangana

ETV Bharat / crime

Minors Porn Films: మైనర్ల నీలిచిత్రాలు అమ్ముతానని ఆఫర్..

నీలి చిత్రాల వెబ్​సైట్లపై కేంద్రం ఇప్పటికే కొరడా ఝుళిపిస్తోంది. మైనర్లపై నీలి చిత్రాలు తీసినా, వాటిని చూసినా.. పోలీసులు చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని నిందితుల సమాచారం సేకరిస్తున్నారు. జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్, పలు సంస్థల సహకారంతో మైనర్లపై నీలి చిత్రాల వ్యాపారాలు నిర్వహించే వాళ్ల గుట్టు రట్టు చేస్తోంది.

Minors Porn Films
Minors Porn Films

By

Published : Nov 9, 2021, 9:14 AM IST

Updated : Nov 9, 2021, 11:12 AM IST

చిన్నపిల్లలతో నీలిచిత్రాలు చిత్రీకరించి.. వాటిని విక్రయిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తిపై దిల్లీలోని జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ అంశంపై తమకు సమాచారం ఇచ్చారంటూ కమిషన్‌ ప్రతినిధి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. వాటిని అంతర్జాలంలో ఏ వెబ్‌సైట్లలో ఉంచారు? ఏఏ లింకులతో విక్రయిస్తున్నారు? అనే వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నీలిచిత్రాలను విక్రయిస్తున్న నేరస్థుడి వివరాలను తెలుసుకున్నారు. విజయవాడలో ఉన్నట్టు గుర్తించారు. నీలిచిత్రాలకు సంబంధించి అంతర్జాలంలో ఉంచిన లింకులు, వాటిని ఎక్కడి నుంచి అప్‌లోడ్‌ చేశారన్న అంశాలపై మరింత సమాచారం సేకరిస్తున్నారు.

వాట్సాప్‌ సందేశం.. తక్కువ ధరకే వీడియోలు.. :

దిల్లీలో నివాసముంటున్న ఓ వ్యక్తికి నెలరోజుల క్రితం వాట్సాప్‌ సందేశం వచ్చింది. తక్కువ ధరకే నీలిచిత్రాలు ముఖ్యంగా మైనర్లపై చిత్రీకరించినవి ఉన్నాయంటూ ఆ సందేశంలో వివరాలున్నాయి. చిన్నపిల్లలపై నీలిచిత్రాల అంశంపై అవగాహన ఉన్న అతడు ఈ విషయాన్ని జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావించాడు. వెంటనే తనకు సందేశం పంపిన వ్యక్తితో వాట్సాప్‌ ద్వారా మాట్లాడాడు. తనకు వందల్లో నీలిచిత్రాల వీడియోలు కావాలని, రూ.2 వేలు ఇస్తానని చెప్పాడు. అంత అవసరం లేదు... రూ.500 చాలంటూ నేరస్థుడు ఆ వ్యక్తికి బదులిచ్చాడు. ఈ మేరకు నగదు బదిలీ చేయగానే... సదరు నేరస్థుడు నాలుగువేల వీడియోలకు సంబంధించిన లింకులను పంపించాడు. వాటిని ఆ వ్యక్తి నేరుగా జాతీయ చిన్నారుల హక్కుల కమిషన్‌కు పంపించాడు. సంబంధిత లింకులను పరిశీలించిన కమిషన్‌ అధికారులు ఐపీ చిరునామాలు హైదరాబాద్‌లో ఉండడంతో పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితుడిని అరెస్ట్‌ చేయాలని అభ్యర్థించారు.

తీవ్రమైన నేరం.. కఠిన చర్యలు..

పిల్లలతో (మైనర్లు) నీలిచిత్రాలను రూపొందించడం, వాటిని అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం తీవ్రమైన నేరం. ఈ నేరంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) కఠినంగా వ్యవహరిస్తున్నాయి. చిన్నారులపై చిత్రీకరించిన నీలిచిత్రాలు ఉన్న వెబ్‌సైట్లను చూస్తున్నవారిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో అంతర్భాగమైన జాతీయ నేరగణాంకాల బ్యూరో గుర్తిస్తోంది. మారుమూల ప్రాంతాల నంచి మెట్రోనగరాల వరకు నీలిచిత్రాల వెబ్‌సైట్లు వీక్షిస్తున్న వారిని గుర్తించేందుకు ఈ బ్యూరో సీసామ్‌ అనే అమెరికన్‌ సంస్థతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. దిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ విదేశాల్లోని వెబ్‌సైట్ల నిర్వాహకులతో సంప్రదించి ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూసిన వారి ఐపీ చిరునామాలను సేకరిస్తోంది. ఆనక ఈ వివరాలను కేంద్రహోంశాకు ఇస్తోంది. ఈ వివరాలను కేంద్ర హోంశాఖ అధికారులు ఆయా రాష్ట్రాల నోడల్‌ సంస్థలకు పంపుతారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని నేరుగా జైళ్లకు పంపుతున్నారు.

Last Updated : Nov 9, 2021, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details