తెలంగాణ

telangana

ETV Bharat / crime

దానిమ్మతోటలో అగ్నిప్రమాదం.. 40 ఎకరాల్లో పంట నష్టం - fire accident news

ఏపీలోని ప్రకాశం జిల్లా ఎస్.కొత్తపల్లిలో 40 ఎకరాల దానిమ్మ తోట... మంటలకు ఆహుతైంది. దాదాపు కోటి రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. తోట యజమాని ఆవుల వెంకటరమణ వృత్తి రిత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు.

fire accident,  pomegranate crop, prakasham district news
దానిమ్మతోటలో అగ్నిప్రమాదం, ప్రకాశం జిల్లా వార్తలు

By

Published : Apr 6, 2021, 10:46 PM IST

దానిమ్మతోటలో అగ్నిప్రమాదం.. 40 ఎకరాల్లో పంట నష్టం

ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఎస్​.కొత్తపల్లిలో 40 ఎకరాల దానిమ్మతోట దగ్ధమైంది. ఆస్ట్రేలియాలో ఉన్న యజమాని వెంకటరణ.. తోట సంరక్షణ బాధ్యతలను కూలి మనుషులకు అప్పగించారు. ఇవాళ సాయంత్రం తోటలో భారీగా మంటలు చెలరేగడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.

రాజకీయ కక్షల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా నిప్పంటించారా?.. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తోటలోని చెట్లు సుమారు 80 శాతం మేర మంటలకు దగ్ధమయ్యాయి. దాదాపు కోటి రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.

ఇదీ చదవండి:లంచం డబ్బు తగలబెట్టిన మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details