తెలంగాణ

telangana

ETV Bharat / crime

సుఖేశ్‌ గుప్తాను వైద్య పరీక్షలకు తరలించిన ఈడీ అధికారులు.. కాసేపట్లో కోర్టుకు..! - ED searches in Hyderabad latest news

ED raids in Musaddilal Gems and Jewellery
ED raids in Musaddilal Gems and Jewellery

By

Published : Oct 19, 2022, 11:34 AM IST

Updated : Oct 19, 2022, 12:06 PM IST

11:31 October 19

సుఖేశ్‌ గుప్తాను వైద్య పరీక్షలకు తరలించిన ఈడీ అధికారులు.. కాసేపట్లో కోర్టుకు..!

మనీలాండరింగ్​ కేసులో అరెస్టైన ఎంబీఎస్ జ్యువెలర్స్ డైరెక్టర్ సుఖేశ్​ గుప్తాను సీసీఎస్ నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ క్రమంలోనే తాను రూ.110 కోట్ల రుణం తీసుకున్నానని.. అందుకు రూ.130 కోట్లు చెల్లించానని సుఖేశ్ గుప్తా తెలిపారు. డబ్బులు చెల్లించినా.. తనను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారని సుఖేశ్ గుప్తా ఆరోపించారు.

అసలేం జరిగిదంటే: ప్రభుత్వరంగ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్​ను మోసగించారన్న ఆరోపణలపై ఎంబీఎస్​ గ్రూపు సంస్థల అధినేత సుఖేశ్​ గుప్తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్ చేశారు. ఎంఎంటీసీ నుంచి కొనుగోలుదారుల క్రెడిట్ పథకం కింద బంగారం కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై.. సుఖేశ్​ గుప్తాతో పాటు అతడి సంస్థలపై 2013లో సీబీఐ కేసు నమోదు చేసింది.

ఆ కేసు ఆధారంగా రెండు రోజులుగా సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు గత రాత్రి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఎంఎంటీసీలోని కొందరు అధికారులతో కుమ్మక్కైన సుఖేశ్​ గుప్తా​ తగినంత సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించకపోవడమే కాకుండా.. ఫారెక్స్ కవర్ లేకుండానే భారీ ఎత్తున బంగారాన్ని తెచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారానికి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయకపోయినా కొందరు అధికారుల సహకారంతో.. సంస్థ ప్రధాన కార్యాలయానికి తప్పుడు వివరాలు సమర్పించారని దర్యాప్తులో తేలింది.

ఎంఎంటీసీకి రూ.504.34 కోట్ల బకాయి:అయితే వారి నిర్వాకం బహిర్గతమయ్యే నాటికే ఎంఎంటీసీకి పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్లు వాటిల్లింది. గత మే నాటికి వడ్డీతో కలిపి ఎంఎంటీసీకి సుఖేశ్​ గుప్తా​ సంస్థలు రూ.504.34 కోట్లు బకాయిపడినట్లు అధికారులు తేల్చారు. సంస్థల లావాదేవీలను ఎక్కువగా చేసి చూపడం ద్వారా సుఖేశ్​ గుప్తా ఆ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అంతేకాకుండా కొనుగోలుదారుల క్రెడిట్ పథకం ద్వారా సేకరించిన బంగారాన్ని అక్రమంగా విక్రయించడం ద్వారా.. భారీ ఎత్తున లాభాలు గడించి వ్యక్తిగత ఆస్తులను సమకూర్చుకున్నట్లు గుర్తించిన సీబీఐ 2014లోనే అభియోగపత్రం దాఖలు చేసింది.

ఈ క్రమంలో మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడీ ఎంబీఎస్ జ్యుయెలర్స్, ఎంబీఎస్ ఇంప్లెక్స్ సంస్థల నిర్వాహకులు సుఖేశ్​ గుప్తా​ , అనురాగుప్తా, నీతూగుప్తా, వందన గుప్తాకు చెందిన రూ.363.51 కోట్ల విలువైన 45 స్థిరాస్తుల్ని గతేడాది ఆగస్టులో జప్తు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తునకు నిందితులు సహకరించకపోవడమే కాకుండా తగిన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారు.

ఫెమా చట్టం కింద కేసు నమోదు: విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం- ఫెమా కింద నమోదు చేసిన మరో కేసులోనూ ఎంబీఎస్ సంస్థలపై గతంలో ఈడీ రూ.222 కోట్ల జరిమానా విధించింది . ఈ నేపథ్యంలో ఎంఎంటీసీని మోసగించిన సొమ్మును చెల్లించేందుకు నిర్వాహకులు 2019 లో వన్‌టైమ్ సెటిల్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే నిధులు జమచేయకపోవడంతో ఓటీఎస్​లో విఫలమైనట్లు ఎంఎంటీసీ గతేడాది స్పష్టం చేసింది.

ఆ వ్యవహారంపై మరోసారి దృష్టిసారించిన ఈడీ: ఆ నివేదిక ఆధారంగా ఎంబీఎస్ వ్యవహారంపై మరోసారి దృష్టిసారించిన ఈడీ గతేడాది ఆస్తులను జప్తు చేయడం సహా రెండు రోజులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆ సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారంతో పాటు, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలు, కీలకమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:రూ.100 కోట్లకుపైగా విలువైన ముసద్దీలాల్ బంగారం, వజ్రాలు సీజ్‌

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ప్రిన్సిపల్​ డ్రైవర్​ను చితక్కొట్టిన తల్లిదండ్రులు

పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం.. కిరాతకంగా చంపి.. కృష్ణానదిలో పడేసి..

Last Updated : Oct 19, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details