వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మగశిశువు విక్రయం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బాలుడి తల్లిదండ్రులు, కొన్నవారితో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. బాబును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
శిశువు విక్రయం కేసును ఛేదించిన పోలీసులు - తాండూర్‌లో శిశువు విక్రయం కేసును ఛేదించిన పోలీసులు
వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన తొమ్మిది రోజుల మగశిశువు విక్రయం వ్యవహారం కొలిక్కి వచ్చింది. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
జిల్లాలోని తాండూర్‌కు చెందిన భీమ్ అనే వ్యక్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి తొమ్మిన రోజుల పసికందును నాలుగు నెలల క్రితం సంతోష్‌నగర్‌కు చెందిన గౌస్ సుల్తాన్ దంపతులకు రూ. 80వేలకు అమ్మేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిశువును కొనుగోలు చేసిన దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు నేరాన్ని అంగీకరించారు. బాబు తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతయ్య, మధ్యవర్తులు సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:లోయలో వాహనం పడి ఆరుగురు మృతి