ఓ మహిళ ఫిర్యాదుతో విచారణకు వెళ్లిన ఇద్దరు డయల్ 100 పోలీసులపై దాడికి పాలపడిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సునిత అనే మహిళ.. అదే గ్రామానికి చెందిన వ్యక్తులు తన ఇంటికి వచ్చి గొడవ పడుతున్నారని డయల్ 100కు కాల్ చేసింది. ఫిర్యాదు స్వీకరించిన సంగెం పోలీసులు... సదరు మహిళ ఇంటికి వెళ్లారు.
Attack :విచారణకు వెళ్లిన పోలీసులపై దాడి.. ఆ పై పరారీ - police were beaten in warangal rural district
ఓ మహిళ ఫిర్యాదుతో విచారణకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దాడిలో హెడ్కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్ గ్రామీణ జిల్లా, పోలీసులపై దాడి, సంగెంలో పోలీసులపై దాడి
అప్పటికే అక్కడ గొడవ జరుగుతుండటం వల్ల పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా ఆ వ్యక్తులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులపై కర్రలు, బీర్ సీసాలతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.