మైలార్‌దేవ్‌పల్లిలో నిన్న మధ్యాహ్నం జరిగిన దారుణ హత్య కేసులో.. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రతీకార హత్యగా తేల్చిన పోలీసులు దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అంజాద్ ఖాన్ కుమారుడికి... తన కూతురుని ఇచ్చి వివాహం చేశాడు అసద్. కొన్నాళ్ల తర్వాత మనస్ఫర్థలు వచ్చి భార్యభర్తలు విడిపోయారు. కూతురు కాపురం చెడిపోవడానికి అంజాద్ ఖాన్ కారణమని కక్ష్య పెంచుకున్న అసద్, అతన్ని 2018లో శాస్త్రిపురంలో సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు.
అసద్‌ది ప్రతీకార హత్యే: పోలీసులు - తెలంగాణ తాజా వార్తలు
గురువారం మధ్యాహ్నం మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన హత్య కేసులో.. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేరుగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
ఈ కేసులో అసద్ జైలుకు వెళ్లి వచ్చాడు. తండ్రిని చంపిన అసద్‌ను ఎలాగైనా హత్య చేయాలని అంజాద్ కుమారులు.. పథకం పన్నారు. నిన్న మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అసద్‌ను.. వట్టేపల్లి సమీపంలో ఆటోతో ఢీకొట్టారు. కింద పడిపోయిన అసద్‌ను వేట కొడవలితో తల చిధ్రమయ్యే వరకు దాడి చేశారు. మృతి చెందారని నిర్ధరించుకున్న తర్వాత నిందితులు ఆటోలో పారిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు... వారి నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేరుగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:వేట కొడవళ్లు.. 50కి పైగా కత్తిపోట్లు