తిరుమలలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడని తొలుత భావించినా.. అతనిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. దుకాణం నంబర్.84 వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించుకొని మల్లిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అందువల్లనే ఇతర దుకాణాలు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తివివరాలు వెల్లడిస్తామన్నారు.
తిరుమల అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్ - tirumala fire accident issue updates
తిరుమలలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం వల్లే ఇతర దుకాణాలు దగ్ధమయ్యాయని వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వెల్లడించారు.
![తిరుమల అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్ twist in Tirumala fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11677504-527-11677504-1620396710560.jpg)
తిరుమల అగ్నిప్రమాద ఘటన వార్తలు
ప్రమాదానికి కొంత సమయం ముందు తన ఫోన్‌ను మల్లిరెడ్డి స్నేహితునికి ఇచ్చాడు. ఈ ఫోన్లో ఓ సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలు ఉన్నట్లు ఆ వీడియోలో మల్లిరెడ్డి ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. డబ్బాతో పెట్రోల్ తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
తిరుమల అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్
ఇవీచూడండి:తిరుమలలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం