ఈ నెల 21న సంచలనం సృష్టించిన నగ్న మృతదేహం హత్య కేసు(naked dead body case)ను చంద్రాయణ్‌గుట్ట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి ఒక ఆటో, ఓ ద్విచక్రవాహనం, కత్తి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రోజు చంద్రాయణాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని లేక్ వ్యూ హిల్స్ ప్రాంతంలో కత్తి పోట్లతో నగ్నంగా ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు.. కార్వాన్కు చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ ఆసిఫ్‌గా గుర్తించారు. ముమ్మర విచారణ చేయగా.. ఆసిఫ్‌ను లంగర్‌హౌస్‌కు చెందిన రౌడీ షీటర్ ఆదిల్... మరో నలుగురి సహాయంతో ఈ హత్య చేసినట్లు నిర్ధరించారు.
ఆటోడ్రైవర్‌పై రౌడీషీటర్ కక్ష..
లంగర్‌హౌస్ పీఎస్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ ఇస్మాయిల్ అలియాస్ ఆదిల్ ఓ దొంగ. బెదిరింపులకు పాల్పడడం.. ఎదురు తిరిగితే కొట్టడం.. అమ్మాయిలను వేధించడం.. లాంటి పనులు చేస్తాడని.. తనపై ఆసిఫ్ ప్రచారం చేస్తున్నాడని ఆదిల్ కక్ష పెంచుకున్నాడు. ఆసిఫ్‌ను అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. స్నేహితులు తాజుద్దీన్, షేక్ ఉస్మాన్, మహమ్మద్ సాహిల్, మహమ్మద్ రెహన్తో కలిసి 20వ తేదీన ఆదిల్ పథకం రచించాడు.
మందు తాగించి..