Woman Kidnaps a boy in Krishna District : కృష్ణా జిల్లాలో ఈ నెల 19న 15 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించి బాలుడిని ప్రలోభ పెట్టిన స్వప్న(30) అనే మహిళ.. గత నెల రోజులుగా బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. ఆ సన్నిహితంతోనే బాలుడికి మాయమాటలు చెప్పి.. కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించారు.
15 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం.. కిడ్నాప్ చేసి.. - ap crime news
Woman Kidnaps a boy in Krishna District : ఆమెకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉండటం లేదు. ఏమి తెలియాలో తోచక.. ఎదురింట్లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలుడిపై ఆమె కన్నేసింది. ముందుగా బాలుడిని పరిచయం చేసుకుని.. అతడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఆ బాలుడు బాగా దగ్గరవడంతో ఫొన్లో వీడియోలు చూపించి ప్రలోభపెట్టి.. శారీరక సంబంధం ఏర్పరచుకుంది. ఎవరికి తెలియకుండా నెలరోజుల పాటు దీనిని కొనసాగించింది. ఎవరికైనా అనుమానం వస్తుందనే భయంతో పిల్లాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే బాలుడికి మాయమాటలు చెప్పి.. హైదారాబాద్ తీసుకెళ్లింది. పిల్లాడు కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు ఈ కేసును ఛేదించారు.
పోలీసుల కథనం ప్రకారం.. 'గుడివాడ గుడ్మెన్ పేటలో ఎదురెదురు ఇళ్లలో నివాసముంటున్న స్వప్న అనే మహిళ, బాలుడు గత 19వ తేదీ నుంచి కనిపించకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 'ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాము. ప్రాథమిక విచారణలో మాయమాటలతో స్వప్న బాలుడిని అపహరించినట్లు గుర్తించాం. అనంతరం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి స్వప్న, ఆ బాలుడు హైదరాబాద్ బాలానగర్లో ఉన్నట్లు గుర్తించాం. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించి.. స్వప్నపై పోక్సో చట్టం, కిడ్నాప్ కేసు నమోదు చేశాం' అని టూ టౌన్ సీఐ దుర్గారావు తెలిపారు.