ఓ యువకుడు కోడిగుడ్ల వ్యాపారం చేస్తుంటాడు. డబ్బు ఎక్కువ కావాలనే ఆశతో.. ఇతరులపై బెదిరింపులకు దిగుదామని ప్లాన్ చేశాడు. నార్మల్గా బెదిరిస్తే ఎవరూ లెక్కచేయరు అనుకున్నాడేమో.. వరుసకు బావ అయినా వ్యక్తి దగ్గర గన్ తీసుకున్నాడు. అయితే మనోడికి ఓ సందేహం వచ్చింది. అదేంటంటే ఆ గన్ పని చేస్తుందా లేదా అని. ఇంకేముంది అర్ధరాత్రి దానిని టెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అనుకున్నదే తడవుగా మరో వ్యక్తితో కలిసి.. బైక్పై వెళ్లాడు. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం కొత్తపేటకు చెందిన కేరళ సత్యనారాయణ అలియాస్ శ్రీనివాస్ కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నాడు. వరgసకు బావైన విజయనగరానికి చెందిన బొత్స మోహన్ నుంచి 9 ఎమ్ఎమ్ యుఎస్ మేడ్ తుపాకీని తెచ్చుకున్నాడు. ఈ గన్ చూపించి బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తుపాకీ పేలుతుందో.. లేదో పరిశీలించేందుకు.. ఇంటి పక్కనున్న ఆటో డ్రైవర్ అంబాళ్ల హరిసూర్యతో కలిసి ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి బయటకు వచ్చాడు.