మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీసులు తెలిపారు. వాహనాలను సీజ్ చేసి... 23 మంది డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేశామని చిట్యాల ఎస్సై వీరభద్రంరావు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారు జామున కల్వపల్లి గ్రామ శివారులో పోలీసులు మూడు బృందాలుగా తనిఖీలు చేపట్టారు.
మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా... 12 ట్రాక్టర్లు సీజ్ - తెలంగాణ వార్తలు
మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి... పలువురిపై కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
![మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా... 12 ట్రాక్టర్లు సీజ్ police-seized-illegal-sand-transport-tractors-at-kalvapally-chityala-mandal-in-jayashankar-bhupalpally-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10878651-thumbnail-3x2-sand---copy.jpg)
మానేరు నుంచి అక్రమ ఇసుక రవాణా... 12 ట్రాక్టర్లు సీజ్
చిట్యాల, రేగొండ, ఘనపూర్ మండలాలకు చెందిన ట్రాక్టర్లను సీజ్ చేశామని ఎస్సై పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై సూర్యనారాయణ, ఏఎస్సై సమ్మిరెడ్డి, పోలీసు సిబ్బంది కమలాకర్, నవీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం.. కత్తులు, తల్వార్లతో వీరంగం