వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఆదివారం సంభవించిన పేలుడు ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు... భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన పాత భవనంలో పోలీసులు సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
విస్తృత తనిఖీలు
డీఎస్పీ లక్ష్మీనారాయణ, గ్రామీణ సీఐ జలంధర్ రెడ్డి, బాంబు డిస్పోజబుల్ బృందంతో పాటు పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ శిథిల భవనంలో గుర్తించిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ పరిసరాల్లోకి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు నిలువరించారు.