ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బి. కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం పట్టుబడింది. వంకమరి చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ బంగారాన్ని సీజ్ చేశారు. బద్వేల్ ఉపఎన్నికల నేపథ్యంలో పోలీసులు సోమవారం అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ప్రొద్దుటూరు నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తున్న ఓ కారులో రూ. 75 లక్షలు విలువ చేసే బంగారు అభరణాలు పట్టుబడ్డాయి.
Gold Seized: భారీగా బంగారు ఆభరణాల పట్టివేత
సరైన ఆధారాలు లేకపోవటంతో భారీగా బంగారు ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. కడప జిల్లా బి.కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 75 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి మణికంఠపై కేసు నమోదు చేశారు.
బంగారం పట్టివేత, బంగారం సీజ్
బంగారం కొనుగోలు చేసిన వ్యాపారి మణికంఠ వద్ద సరైన ఆధారాలు లభించకపోవటంతో ఆ బంగారం స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.