తెలంగాణ

telangana

ETV Bharat / crime

కారులో గంజాయి స్వాధీనం... ఐదుగురు అరెస్ట్ - telangana news

భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 28 కేజీల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Illegal marijuana seizure
అక్రమ గంజాయి స్వాధీనం

By

Published : Jun 18, 2021, 7:10 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద 28 కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని భద్రాచలం ఏఎస్‌పీ వినీత్ తెలిపారు.

నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశామని వినీత్ తెలిపారు. వీరి నుంచి ఒక ద్విచక్ర వాహనాన్ని, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:cheating: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టారు

ABOUT THE AUTHOR

...view details