తెలంగాణ

telangana

ETV Bharat / crime

అక్రమ రవాణా.. 113 కేజీల గంజాయి సీజ్‌ - Suryapeta district police seized the cannabis

పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా... గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. పలు మార్గాల ద్వారా అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో అక్రమంగా తీసుకెళ్తున్న 113 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Suryapeta district police seized the cannabis
గంజాయిని స్వాధీనం చేసుకున్న సూర్యాపేట జిల్లా పోలీసులు

By

Published : Apr 7, 2021, 3:45 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు వద్ద 113 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి నిజామాబాద్​కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు నాగారం సీఐ తుల శ్రీనివాస్ తెలిపారు. ఈటూరుకు చెందిన ఏల శోభన్ బాబు ,హన్మకొండకు చెందిన మహమ్మద్ పాష , రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

AP36AE6677 నెంబర్​ గల మారుతి షిఫ్ట్ కారులో భద్రాచలం నుంచి నిజామాబాద్​కు తరలిస్తుండగా ఏల శోభన్ బాబు స్వస్థలమైన ఈటూరులో వీరు విశ్రాంతి తీసుకున్నారు. ఖచ్చితమైన సమాచారం ప్రకారం ఎస్ఐ హరికృష్ణ తన సిబ్బందితో కలసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని రవాణా వెనుక ఎవరెవరున్నారో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. గంజాయిని పట్టకోవటంలో కీలక పాత్ర పోషించిన నరేశ్, గిరి, వీరన్న, నాగరాజులను సీఐ అభినందించారు.

ఇదీ చదవండి:క్వారీ సమీపంలో పేలుడు పదార్థాలు

ABOUT THE AUTHOR

...view details