ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలోని కాజా టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న పండ్ల లారీని పరిశీలించారు. ఈ క్రమంలో లారీలో 300 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు.
Marijuana: గుంటూరులో 300 కిలోల గంజాయి పట్టివేత
ఏపీలోని గుంటూరు నగరంలో కాజా టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. పండ్ల లారీలో 300 కిలోల గంజాయిని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి పట్టివేత
పండ్ల కింద గంజాయి పెట్టి తరలించేందుకు యత్నించినట్లు మంగళగిరి పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. ప్లాన్ బీ & సీ ఉండాల్సిందే!