తెలంగాణ

telangana

ETV Bharat / crime

SP Sangram Singh: 'పోలీసులను హతమార్చేందుకు కుట్రపన్నిన మావోయిస్టులు' - ఎస్పీ సంగ్రామ్ సింగ్

SP Sangram Singh: పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రను పోలీసులు తిప్పికొట్టారు. నాగారం మండలంలోని దొడ్ల గ్రామసమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. మావోయిస్టుల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను హతమార్చేందుకే కుట్రపన్నారని.. ఎస్పీ సంగ్రాంసింగ్ వెల్లడించారు.

maoist-ammunition
మావోయిస్టుల కుట్ర

By

Published : Feb 1, 2022, 3:50 PM IST

SP Sangram Singh: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మావోయిస్టులు అమర్చిన మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొడ్ల గ్రామం సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు... జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, క్లైమర్‌ మైన్స్‌తో పాటు మరికొన్ని మందుగుండు సామగ్రిని పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు డిటోనేటర్, మూడు క్లైమర్ మైన్స్, 5 కప్లింగ్స్, 33 ఎస్​ఎల్​ఆర్​ రౌండ్స్, 100 మీటర్ల వైరు, 1 బ్యాటరీ, రెండు కేజీలు మేకులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులను హతమార్చాలనే కుట్రతోనే మావోయిస్టులు వీటిని అమర్చారని ఎస్పీ సంగ్రాంసింగ్‌ తెలిపారు. మావోయిస్టులు చేసే ఇలాంటి చర్యలతో ఇప్పటికే ఎంతో మంది అమాయకులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు. 2019లో మార్చి నెలలో ఇలా మావోయిస్టులు అమర్చిన మందుగుండుకు పెంటయ్య అనే వ్యక్తి బలయ్యాడని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ల్యాండ్​మైన్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details