తెలంగాణ

telangana

ETV Bharat / crime

భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత... ఇద్దరు అరెస్టు - Khammam police seize counterfeit seeds

లైసెన్స్‌ లేకుండా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 16 లక్షల విలువైన నకిలీ మిరప విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

Khammam police seize counterfeit seeds
నకిలీ మిరప విత్తనాలను పట్టుకున్న పోలీసులు

By

Published : Jun 7, 2021, 5:03 PM IST

ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని ఎన్కూరులో లైసెన్స్‌ లేకుండా రైతులకు అంటగడుతున్న సుమారు 16 లక్షల రూపాయల విలువైన నకిలీ మిరప విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా ఇద్దరు నిందితులను ఆదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.

కర్నాటకలో ఫార్మసన్‌ సీడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కేంద్రంగా ఈ నకిలీ విత్తనాల దందా కొనసాగుతుందని నిందితులు ఇచ్చిన సమాచారంతో కంపెనీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌పై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా వివిధ కంపెనీల లేబుల్స్‌పై ఎటువంటి లైసెన్స్‌ లేకుండా విత్తనాలను రైతులకు అంటగడుతున్నారని ఖమ్మం సీపీ విష్ణువారియర్ తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:T-Congress : 'కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వాలు విఫలం'

ABOUT THE AUTHOR

...view details