తెలంగాణ

telangana

ETV Bharat / crime

నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు - నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్న చిరాగ్ పల్లి పోలీసులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి వద్ద ముంబయి-హైదరాబాద్ 65వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా బీదర్ జిల్లా హుస్నాబాద్ నుంచి లారీలో తరలిస్తున్న నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

gutka
gutka

By

Published : May 24, 2021, 7:44 PM IST

కర్ణాటక నుంచి హైదరాబాద్​కు అక్రమంగా తరలిస్తున్న రూ. 30 లక్షల విలువైన గుట్కాను సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి వద్ద ముంబయి-హైదరాబాద్ 65వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన లారీని తనిఖీ చేయగా.. నిషేధిత గుట్కా బస్తాలు లభించాయి.

అక్రమ రవాణాకు పాల్పడుతున్న హైదరాబాద్​కు చెందిన షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, షేర్అలీతో పాటు లారీ డ్రైవర్ గౌసుద్దీన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని జప్తు చేసి పట్టుబడిన గుట్కా బస్తాలను ఠాణాలో భద్రపరిచారు.

ABOUT THE AUTHOR

...view details