political strategist Sunil Kanugulu: రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్ ఇనార్బిట్‌మాల్ సమీపంలోని ఎస్‌కే కార్యాలయంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు సీజ్ చేశారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. సోదాల సమయంలో కార్యాలయంలోని సిబ్బంది ఫోన్‌లను స్విచ్చాఫ్ చేయించినట్టు సమాచారం.
రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు - తెలంగాణ తాజా వార్తలు
political strategist Sunil Kanugulu: సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు సీజ్ చేశారు.
![రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు Sunil Kanugulu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17198276-423-17198276-1670950392580.jpg)
Sunil Kanugulu
గత కొంత కాలంగా ఎస్‌కే టీమ్ కాంగ్రెస్ కోసం పనిచేస్తోంది. ఎస్‌కే కార్యాలయంపై పోలీసుల దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు. సునీల్ కార్యాలయాన్ని కుట్రపూరితంగా సీజ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు. ఎఫ్ఐఆర్ లేకుండా ఎలా తనిఖీ చేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
ఇవీ చదవండి:
- డెంటిస్ట్ కిడ్నాప్ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్
- బీఎల్ సంతోష్, జగ్గు స్వామికి ఇచ్చిన 41ఏ నోటీసుపై స్టే కొనసాగింపు
- 'బాధితులను ఆదుకోని కేసీఆర్.. కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తారా?'