వికారాబాద్లో గతనెలలో పోలీసులకు దొరికిన తూటా సమాచారం అంతుచిక్కడం లేదు. అటవీప్రాంతంలోకి తూటా ఎక్కడినుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. యాలాల మండల పరిధిలో డిసెంబర్ 24న తూటా పోలీసులకు లభించింది. ఈ నేపథ్యంలో తాండూరు నియోజకవర్గ పరిధిలో 61 మంది గన్ లైసెన్సులను పోలీసులు పరిశీలించారు.
వికారాబాద్ అటవీప్రాంతలో లభించిన తూటాపై పోలీసుల ఆరా - వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో గతనెల 24న లభించిన తూటాపై పోలీసులు దర్యాప్తు
వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో గతనెల 24న లభించిన తూటాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని 61 మంది వ్యక్తుల గన్ లైసెన్సులపై తనిఖీలు నిర్వహించారు.
వికారాబాద్ అటవీప్రాంతలో లభించిన తూటాపై పోలీసుల ఆరా
జిల్లాలో 300 మందికి పైగా గన్ లైసెన్సులు ఉన్నాయి. వారందరిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎలా వచ్చిందో ఇప్పటివరకు అంతు చిక్కలేదు. వన్యప్రాణుల వేటకు వచ్చిన వారిదై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో తూటా దెబ్బకి ఆవు బలైన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎవరైనా అడవిలో వేటకు వచ్చి వదిలి వెళ్లారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.