ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా అలిపిరి ప్రాంతంలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్ బాలుడి కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో కిడ్నాపర్ కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారిలో ఓ కుటుంబానికి చెందిన శివమ్ కుమార్ సాహూ అనే బాలుడు.. తిరుపతిలోని అలిపిరి బస్టాండ్ వద్ద ఫిబ్రవరి 27న అపహరణకు గురయ్యాడు. నిందితుడు చిత్తూరు జిల్లా వి.కోట పరిసర గ్రామవాసి శివప్పగా గుర్తించిన పోలీసులు.. రెండ్రోజుల క్రితం అతని కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు.
బాలుడి అపహరణ కేసులో పురోగతి - Boy Kidnap Case news
ఏపీలోని చిత్తూరు జిల్లాలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్ బాలుడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుని కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు.
బాలుడి అపహరణ కేసులో పురోగతి
వి.కోటలో పిల్లల అపహరణ ముఠా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ముఠా సభ్యుడా? ఇంకేమైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వి.కోట సరిహద్దు కర్ణాటక గ్రామాల్లోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: కారు బీభత్సం... పలువురికి తీవ్ర గాయాలు