Suicide attempt in Varanasi: అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందామని ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వెళ్లిన వరంగల్ వ్యక్తిని అక్కడి పోలీసులు రక్షించారు. వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవడంతో.. అప్పుల బాధ భరించలేక మోక్షం పొందడం కోసం ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసులకు తెలిపారు. వరంగల్ జిల్లా కొత్తగట్టుకు చెందిన శ్రీనివాస్.. ఇటీవల వేసిన మద్యం షాపుల టెండర్లలో తనకు రూ. 50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదని.. అప్పులు తీరే మార్గం లేక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని భావించి.. ఆత్మహత్య చేసుకున్న పాపం కూడా పోతుందని వారణాసికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.
మళ్లీ రానని చెప్పి