ఓ మహిళ చెరువులో దూకగా ఓ కానిస్టేబుల్ ఆమెను రక్షించారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన మహిళ ప్రాణాలు నిలిపారు. మెదక్ జిల్లా నిజాంపేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
చెరువులో దూకిన మహిళ... కాపాడిన కానిస్టేబుల్ - ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు
కుటుంబ కలహాలతో చెరువులో దూకిన మహిళను స్థానికుల సహాయంతో ఓ కానిస్టేబుల్ కాపాడారు. మెదక్ జిల్లా నిజాంపేటలో ఈ సంఘటన జరిగింది. పోలీసు ధైర్యానికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
మహిళను రక్షించిన పోలీసులు
నిజాంపేటకు చెందిన పంజ కళావతి అనే మహిళ సమీపంలోని గడి చెరువులో దూకినట్లు గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ సంతోశ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మరో స్థానికుని సహాయంతో మహిళను కాపాడారు. పోలీసు చూపిన ధైర్య సాహసాలకు ప్రజలు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి:ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయండి: హైకోర్టు
Last Updated : Apr 7, 2021, 4:38 PM IST