తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆత్మహత్యాయత్నం.. తల్లీ పిల్లలను కాపాడిన పోలీసులు - తెలంగాణ వార్తలు

భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ తనువు చాలించాలనుకుంది. ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..ఆ తల్లీ పిల్లలను కాపాడారు.

suicide
suicide

By

Published : May 24, 2021, 10:14 PM IST

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల కేంద్రానికి చెందిన రజియా బేగం.. కుటుంబ కలహాలతో విసిగి పోయింది. పిల్లలతో సహా తనువు చాలించాలనుకుంది. గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. చెరువు వద్దకు చేరుకున్న తల్లీ పిల్లలను గమనించిన స్థానికులు.. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకటేశ్.. హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. బలవన్మరణానికి పాల్పడబోతోన్న తల్లీ పిల్లలను కాపాడారు. మహిళతో మాట్లడి.. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి పోలీస్ స్టేషన్​లు, కోర్టులు, తదితర మార్గాలున్నాయని వివరించారు. ధైర్యం చెప్పి.. వారిని ఇంటికి పంపించారు.

ఇదీ చదవండి:పోలీసుల సమక్షంలో ఇసుక కుప్పలో శవం వెలికితీత

ABOUT THE AUTHOR

...view details