తెలంగాణ

telangana

ETV Bharat / crime

PD Act against ganja smuggler : గంజాయి కేసులో జైలుకెళ్లి.. బెయిల్ మీద వచ్చి మళ్లీ స్మగ్లింగ్.. - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

PD Act against ganja smuggler : గంజాయి అక్రమరవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గాంజా రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కాగా ఓ వ్యక్తి ఇదివరకే గంజాయి రవాణా చేసి జైలుకెళ్లాడు. బెయిల్ మీద వచ్చి మళ్లీ అదే చేస్తున్నాడు. ఆ వ్యక్తిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు.

Ganja Smuggling, pd act on ganja case
గంజాయి కేసులో జైలుకెళ్లి.. బెయిల్ మీద వచ్చి మళ్లీ స్మగ్లింగ్..

By

Published : Jan 11, 2022, 10:48 AM IST

PD Act against ganja smuggler : తరచుగా గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. తమిళనాడుకు చెందిన రాజా స్టాలిన్‌.... వైజాగ్‌ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసి జైలుకు పంపగా... బెయిల్‌పై వచ్చి గంజాయి రవాణాకు పాల్పడుతున్నాడు. పీడీయాక్టు కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుణ్ని చర్లపల్లి జైలుకు పంపారు.

భద్రాద్రి జిల్లా కాచనపల్లిలో మిరపతోటలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జగ్గుతండాకు చెందిన బానోత్ వనరాం.... తన మిరపతోటలో గంజాయి సాగుచేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు గంజాయి మొక్కలను ధ్వంసం చేసి.... నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:MRO Audio Viral : 'ఎవరు లంచం ఇస్తే వాళ్లకు భూమి రిజిస్ట్రేషన్ చేస్తాం!'

ABOUT THE AUTHOR

...view details