సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త ఎత్తుగడలు వేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. పోలీసులు హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజాగా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన అనిత.. మంగళవారం ఓఎల్ఎక్స్లో యాక్టీవా ద్విచక్రవాహనాన్ని చూసింది. వెంటనే ఆ వ్యక్తికి సంప్రదించింది. తాను ఆర్మీలో పనిచేస్తున్నట్లు అనితను నమ్మబలికాడు. వాహన ఫొటోలు, నకిలీ ఆధార్‌కార్డు సహా ఇతర వివరాలు పంపి బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా కొంత డబ్బు పంపాలని అనితను కోరాడు. స్పందించిన ఆమె రూ.2 వేలను పంపింది. ఆ తర్వాత మరో మూడుసార్లు మొత్తంగా రూ.31 వేలును తీసుకొన్నాడు. మధ్యలో ద్విచక్రవాహనాన్ని డెలివరీ కోసం ప్యాక్ చేసినట్లు ఫొటోలూ పంపి అనితను నమ్మించాడు.