తెలంగాణ

telangana

ETV Bharat / crime

మహానగరంలో జూదగాళ్లు.. ఎమ్మెల్యే సహా ప్రముఖులు ..90 లక్షలు స్వాధీనం - హైదరాబాద్​ తాజా నేర వార్తలు

raids on poker camps: తెలంగాణ ప్రభుత్వం పేకాటపై నిషేధం విధించినా పేకాటరాయుళ్లు మాత్రం తగ్గేది లేేదంటున్నారు. తాజాగా హైదరాబాద్​ మాదాపూర్‌లోని కాకతీయహిల్స్‌లో గుట్టుగా జరుగుతున్న పేకాట శిబిరంపై మాదాపూర్‌ డీసీపీ కె.శిల్పవల్లి నేతృత్వంలో సోమవారం రాత్రి దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురు రియల్టర్లతోపాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పొరుగు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నట్టు సమాచారం. నిందితుల వద్ద నుంచి రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

police raids on poker camps
పేకాట శిబిరంపై పోలీసుల దాడి

By

Published : Mar 1, 2022, 12:29 PM IST

raids on poker camps: హైదరాబాద్​ మాదాపూర్​లో పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకతీయ హిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 6 జీనియస్‌ అపార్ట్‌మెంట్‌లో రోజూ పేకాట ఆడుతున్నారని మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం రాత్రి 10 గంటలకు అక్కడి ఫ్లాట్‌ నంబర్‌ 252కు వెళ్లారు. పేకాట ఆడుతున్న రియల్టర్లు వి.శ్రీనివాస్‌, తుమ్మల శ్రీకాంత్‌, గోవర్ధన్‌ రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌, ముగ్గురు మహిళలు సౌజన్య, వసంత, వందన ఉన్నారు. ముగ్గురు మహిళలు రియల్టర్లకు స్నేహితులని రవీంద్ర ప్రసాద్‌ వివరించారు.

పేకాట బ్యాచ్​తో ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

raids on poker camps at madhapur: జీనియస్‌ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు ప్రజాప్రతినిధులున్నారని సమాచారం.. పేకాట శిబిరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు పొరుగు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నట్టు తెలిసింది. జూదం జరుగుతున్న ఫ్లాట్‌ను ఎమ్మెల్సీ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారని, మరో ఎమ్మెల్సీ కూడా ఇక్కడికి తరచూ వస్తుంటారని తెలిసింది. అక్కడున్న మహిళలు రోజూ రూ.లక్షల్లో పేకాట ఆడుతున్నారు. ఇందులో ఓ మహిళ మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి పేకాట ఆడేందుకు వచ్చింది. వారి సంచుల నిండా రూ.500 నోట్లకట్టలున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పోలీసులు చూసీచూడనట్టు వదిలేశారని తెలుస్తోంది. అయితే మాదాపూర్‌ డీసీపీ కె.శిల్పవల్లి మాత్రం రాజకీయనేతలెవరూ లేరని చెబుతున్నారు.

ఇదీ చదవండి:Gun firing on Realtors : రియల్టర్లపై కాల్పులు.. పోలీసుల అదుపులో అనుమానితుడు

ABOUT THE AUTHOR

...view details