హైదరాబాద్ కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో గల బంజావాడీ ప్రాంతంలోని పేకాట స్థావరాలపై డీసీపీ బృందం దాడులు నిర్వహించింది. 13 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు వారివద్ద నుంచి రూ. 93,380 నగదు, 11 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు... 13 మంది అరెస్ట్ - పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
హైదరాబాద్‌లోని బంజావాడీలో 13 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 93,380 నగదును, 11 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
![పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు... 13 మంది అరెస్ట్ Police raids on poker sites in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12201366-927-12201366-1624187921852.jpg)
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
బంజావాడీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అనంతరం ఆ దాడుల్లో దొరికిన 13 మందిని కల్సుంపుర పోలీసులకు అప్పగించారు. ఎవరైనా జూదం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:CM KCR: నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు