Police arrested Poker Players : 10మంది పేకాటరాయుళ్ల అరెస్టు.. నిందితుల్లో పలువురు ప్రజాప్రతినిధులు! - మంచిర్యాల జిల్లా వార్తలు
09:30 October 31
పేకాట శిబిరంపై పోలీసుల దాడి..
మంచిర్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో ఏసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసుల సోదాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో లక్షెట్టిపేటలోని పేకాట శిబిరంపై దాడి చేశారు.
అక్కడ పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారి నుంచి రూ.85,800 స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టుబడిన వారిలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:Ganja Smuggling: ఎల్‌బీనగర్‌లో 110 కిలోల గంజాయి స్వాధీనం