రాష్ట్రంలో కలకలం రేపిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏ1 నిందితుడు కుంట శ్రీను, ఏ2 నిందితుడు చిరంజీవి, ఏ3 నిందితుడు అక్కపాక కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు.... మరో కీలక వ్యక్తి బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చింది బిట్టు శ్రీను అని ఏ1 కుంట శ్రీను తెలిపినట్లు నిన్న ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు.
కత్తులను పండ్ల దుకాణం నుంచి తెచ్చారు
జడ్పీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్ బాధ్యతల్ని బిట్టు శ్రీను చూస్తుంటాడు. హత్యలో ఉపయోగించిన కత్తుల్ని మంథనిలోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. బిట్టు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేయటంతో ఇప్పుడు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పుట్ట మధుకు సంబంధించి పలు విషయాల్లో న్యాయవాది వామన్‌రావు ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా బిట్టు శ్రీనును అరెస్టు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఆరు ప్రత్యేక బృందాలు